ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అనేక అప్డేట్లు వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మరియు లూసిఫర్ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశకు రాగా, లూసిఫర్ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

ఆ రెండు సినిమాలతో పాటు చిరంజీవి మెహర్ రమేష్ తో ఒక సినిమాను మరియు బాబీ తో ఒక సినిమాను చేయనున్నారు. మెహర్ రమేష్ తో చేయనున్న సినిమా తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ యొక్క అధికారిక రీమేక్ గా తెరకెక్కనుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాకు సంబంధించి రేపు ఉదయం 9 గంటలకు ఒక అప్డేట్ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే, మైత్రీ మూవీ మేకర్స్ మరొక అప్డేట్ ను విడుదల చేశారు. చిరంజీవి 154వ చిత్రాన్నిబాబీ తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తున్నారు. అయితే, చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన మెగా వేవ్ రాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఆ మెగా వేవ్ ఏమిటో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చూడాలి. చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే, ఈ సినిమా సముద్ర తీర ప్రాంతంలో సాగే కథలా కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

x