కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరో కార్యక్రమాని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తీర్చడం కోసం ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు గత వారం మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తన మాటను నిలబెట్టుకుంటానని ఆయన చెప్పాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ సిలిండర్లు ను మరియు కాన్సన్ట్రేట్స్ కొనుగోలు చేసింది.

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబందించిన వీడియోను ఛారిటబుల్ ట్రస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

” ప్రస్తుతం మొదట ఆక్సిజన్ సిలిండర్లు ను గుంటూరు మరియు అనంతపురం జిల్లాల్లోని ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు చిరు చెప్పారు. మేము మరిన్ని పరికరాలను సేకరించినప్పుడు, మేము వాటిని వెంటనే తెలుగు రాష్ట్రాల ఆసుపత్రుల అన్నిటికి పంపిస్తామని, ”అని చిరు వీడియోలో చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరు చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇంత పెద్ద మొత్తంలో సిలిండర్లు మరియు కాన్సన్ట్రేట్స్ సేకరించడానికి రామ్ చరణ్ ఎంతో కృషి చేశాడని మెగాస్టార్ చెప్పారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఉండటంతో చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ తీసుకు వచ్చామన్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా బాధితులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అవసరాన్ని పర్యవేక్షిస్తామని చెప్పారు.

x