‘వకీల్ సాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ రేసులో కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గారు తన నట విస్వరూపాని చూపించారు. ఈ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ మూవీకి రెమిక్ గా తెరకెక్కింది. ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి ఈ సినిమా రావడం తో ఈ సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది.

పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమా లోని స్టోరీ చాలా డెప్త్ ను కలిగి ఉంది, కనుక హీరో తో పాతు ప్రతినాయకుడి పాత్రకు కూడా ఈ మూవీ లో చాలా బలం ఉంది. కనుక ప్రతినాయకుడి పాత్ర కోసం చిత్ర బృందం ప్రకాష్ రాజ్ గారిని తీసుకున్నారు. ఆయన చేసిన యాక్టింగ్ గురించి చెప్పనవసం లేదు అంతా భాగా నటించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ న్యాయవాది నందాగా నటించాడు. ప్రకాష్ మరియు పవన్‌ల మధ్య కోర్టు దృశ్యాలు రెండవ భాగంలో ప్రధానమైనవి.

ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ నటనను మెచ్చుకున్నారు. ప్రకాష్ రాజ్ మెగాస్టార్ ను కలుసుకొని ఫ్లవర్ బుకేని అందజేశాడు.

“ ప్రకాష్‌రాజ్ మంచి క్యాలిబర్ నటుడు అంతూ, వకీల్‌సాబ్‌ సినిమాలో అతని నటన అద్భుతం మరియు అతను పవన్‌కళ్యాణ్‌కి గొప్ప ప్రతినాయకుడి రూపం లో కనిపించదు. ప్రకాష్ రాజ్ గారికి నా అభినందనలు ”అని చిరు ట్వీట్ చేశారు.

x