టాలీవుడ్ హీరోయిన్ ‘మెహ్రీన్ కౌర్ పిర్జాదా’ మార్చి 12 న జైపూర్‌లోని ‘భవ్య బిషోని’ తో తన కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఈ జంట వివాహం చేసుకోవాలని ఆలోచించారు, అయితే మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా వేసినట్లు మెహ్రీన్ ఇటీవల ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆమె పెళ్లి ఆపేస్తున్నాం అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో ఆమె ఇలా రాశారు. “భవ్య బిషోని మరియు నేను మా పెళ్లిని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. పెళ్లితో ముందుకు సాగాలని అనుకోవడంలేదు. ఇది స్నేహపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటి నుండి నాకు భవ్య బిషోని, అతని కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో సంబంధం లేదు ”అని మెహ్రీన్ కౌర్ రాశారు.

x