తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలను అనుసరించి నేటి నుంచి మినీ లాక్ డౌన్ అమలు చేయనున్నారు. తిరుపతిలో 14 రోజుల పాటు ఈ మినీ లాక్ డౌన్ అమలులో పెట్టనున్నారు.
తిరపతి మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి, వాటిలో సగం కేసులు తిరుపతి లోనే నమోదవుతున్నాయి. మార్చి నుంచి చిత్తూరు జిల్లాలో 2 లక్షల 20 వేల 262 పరీక్షలు నిర్వహించగా అందులో 20 వేల 851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చిత్తూరు జిల్లాలో పాజిటివ్ రేట్ 9.17 శాతానికి చేరుకుంది. తిరుపతిలో ఇప్పటి వరకు 9 వేల 154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న బాధితుల సంఖ్యకు తగ్గట్లుగా తిరుపతి హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్న పూర్తిస్థాయిలో బాధితులకు అండగా ఉండడం లేదు.
దీంతో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో మేయర్ శిరీష, కమిషనర్ గిరీష్ మరియు sp వెంకట్ అప్పలనాయుడుతో సమావేశం నిర్వహించి తిరుపతి నగరంలో మినీ లాక్‌డౌన్ ను తీసుకు వచ్చారు. మినీ లాక్ డౌన్ లో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఇక ప్రజలు గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. 14 రోజుల పాటు ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంది.