తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నగర వ్యాప్తంగా భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టింది. ఈ రోజు బాలానగర్ ప్రజల చిరకాల స్వప్నాన్ని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. ట్రాఫిక్ కష్టాలతో బాలానగర్ ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఆ ట్రాఫిక్ కష్టాలను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. నేటి నుంచి ఆ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఈ బాలానగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.
బాల నగర్ చౌరస్తా మీదుగా నిర్మించిన 6 లైన్ల ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల కూకట్‌పల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్ వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌గారు 2017 ఆగస్టు 21న ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 387 కోట్ల రూపాయలను కేటాయించింది.
కానీ, ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం 270 కోట్ల లోపే పూర్తయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిగిలిన నిధులతో రహదారి విస్తరిస్తామని ఆయన అన్నారు. హెచ్ఎండిఎ ద్వారా నిర్మాణం చేసిన ఈ ఫ్లైఓవర్‌కు మంత్రి కేటీఆర్ “బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్‌గా” నామకరణం చేశారు.