ఓ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. దీంతో ప్రేమించిన అమ్మాయిని ఆ యువకుడు ఏకంగా ఇంటికి తీసుకు వచ్చాడు. కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది. ప్రేమ మైకం లో ఉన్న ఆ యువకుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట కు వయసు అడ్డుగా మారింది. అబ్బాయి మైనర్ కావడంతో పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ (18) అనే యువకుడికి గజ్వేల్ కు చెందిన (20) ఏళ్ల యువతి తో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు తనకు పెళ్లి చేయాలని అమ్మాయిని తెచ్చి తల్లిదండ్రుల ముందు ఉంచాడు.

అబ్బాయి మైనర్ కావడంతో తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు. అమ్మాయిని తీసుకు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని ఎంత నచ్చచెప్పినా ఆ యువకుడు వినలేదు. తన ప్రేయసి దూరమైందనే బాధతో, మద్యం మత్తు లో వాటర్ ట్యాంక్ ఎక్కి బీర్ బాటిల్ తో తలపై బాదుకున్నాడు.

ఆ దృశ్యం చూసి గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని బుజ్జగించి కిందకి దింపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కుటుంబ సభ్యుల సమక్షంలో కాన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు.

x