బంగార్రాజు ప్రెస్ మీట్ లో నాగార్జున ఒకటికి నాలుగు సార్లు, నా సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగార్జున చెప్పిన మాటే నిజమైంది. బంగార్రాజు సినిమాకు ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయింది.
ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూ ను ఎట్టి వేయడంతో బంగార్రాజు సినిమా ఊపిరిపీల్చుకుంది. ఒకపక్క నైట్ కర్ఫ్యూ.. మరోపక్క 50% ఆక్యుపెన్సీ మరియు ఏపీలో టికెట్ రేట్లు తగ్గింపు.. ఈ భయాలన్నీ బంగార్రాజు సినిమాను వెంటాడిన నాగార్జున మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువైనా నా సినిమాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్న భరోసాతో నాగార్జున ఉన్నారు.
ప్రస్తుతం బంగార్రాజు మూవీ కి ఉన్న ప్రధాన అడ్డు తొలగిపోయింది. కరోనా ను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ పెట్టడంతో మూడు ఆటలకు మాత్రమే ఛాన్స్ ఉంది. అయితే, ఈ పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు వస్తుండటంతో వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నైట్ కర్ఫ్యూను 18 వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
దీంతో పండగ సినిమాలు నాలుగు ఆటలతో ప్రదర్శించే వీలు కలిగింది. పండగ వేళ ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో నైట్ షో చాలా ముఖ్యం. కోడి పందాలు కారణంగా ఏపీలో మార్నింగ్ షో మ్యాట్ని షో కంటే ఫస్ట్ షో సెకండ్ షో లకే ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. సినిమా ఎలా ఉన్నా ఈ రెండు షోలు మాత్రం ఫుల్ అవుట్ ఉంటాయి. నాలుగు రోజులపాటు సెకండ్ షో వేసుకునే అవకాశం రావడం సినిమాలకు పండగే అని చెప్పవచ్చు.