తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోల్లో నిఖిల్ ఒకరు. నిఖిల్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా అతను చాలా మందికి సహాయం చేశారు. అతను జాతీయ రాజకీయాలను మరియు అంతర్జాతీయ రాజకీయాలను కూడా అనుసరిస్తూ ఉంటాడు. అయితే, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులపై నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇన్నేళ్లు అమెరికా ప్రభుత్వం తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉంచింది. కానీ, ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 లోపు మిగిలిన సైనికులందరినీ వెనక్కి తీసుకు వచ్చేలా అమెరికా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకొని తమ దురాగతాలను ప్రారంభించారు. ఎంతో మంది మ‌హిళ‌లు, చిన్నారులు ప‌డుతున్న బాధ‌ల‌ను చూసి ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. అమెరికా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి భిన్నంగా ఉండేది అని చాలా మంది అభిప్రాయం.

ఈ క్రమంలోనే యువ హీరో నిఖిల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ ప్రపంచం అనే దానికి అమెరికా ఒక ఉదాహరణ లాగా ఉండేది.. కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది.. 21 సంవత్సరాలు మీరు ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడు ఇలా పారిపోతున్నారు.. జో బైడెన్ నువ్వు మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది.. ఎదవ.. అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు.

x