దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన నటుడు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు పేరుతో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు ఎక్కువగా సంస్థ యొక్క వ్యవస్థాపకుల పేర్లు పెడుతూ ఉంటారు. అయితే, మోహన్ బాబు రెండు దశాబ్దాలకు పైగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

మోహన్ బాబు నిర్వహిస్తున్న విద్య సంస్థల్లో ఏ స్టూడెంట్ తన క్యాస్ట్ చెప్పాల్సిన పని లేదు. తన విద్యాసంస్థల్లో క్యాస్ట్ అనే పదాన్ని తొలగించడం వల్ల ఆయన చాలా ప్రశంసలు అందుకున్నారు. మరోపక్క అందరికీ మంచి విద్యను అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా లభించింది. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మోహన్ బాబు స్వయంగా ట్వీట్ చేస్తూ, “నా తల్లిదండ్రుల ఆశీర్వాదం.. ఫ్యాన్స్ మరియు మిత్రుల ఆశీస్సుల‌తో ఎం.బి.యు (మోహన్ బాబు యూనివర్సిటీ)ని స్టార్ట్ చేస్తున్నాము. శ్రీ విద్యానికేతన్ లో వేసిన విత్తనాలు ప్రస్తుతం కల్పవృక్షం గా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం మరియు నా జీవిత లక్ష్యం ఇప్పుడు అభ్యాస విశ్వంలోకి చేరింది. ఇప్పుడు తిరుప‌తిలో మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీని మీకు అందిస్తున్నాను. మీరు నాపై చూపించిన ప్రేమే నా బ‌లం. నా కలకు మీరందరు మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

image source

x