ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ తో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న కరోనా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు. కోవిడ్ టెస్టులు పెంచడంతో అంటే స్థాయిలో పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి. గత 24 గంటల్లో 44 వేల కోవిడ్ టెస్టులు నిర్వహించగా 13 వేల 212 మందికి వైరస్ నిర్ధారణ అయింది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 64 వేల 136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆరు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

1. విశాఖజిల్లాలో 2,244 కేసులు,
2. చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు,
3. అనంతపురంలో జిల్లాలో 1,235 కేసులు,
4. శ్రీకాకుళంలో జిల్లాలో 1,230 కేసులు,
5. గుంటూరు జిల్లాలో 1,154 కేసులు,
6. నెల్లూరు జిల్లాలో 1,151 కరోనా కేసులు నమోదయ్యాయి.

పాజిటివ్ కేసులు పెరగడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. దీనిపై ఏపీ క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ వైద్యశాఖ ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలని సూచించారు.

x