మోసగాళ్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్:

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మాతగా, హాలీవుడ్ దర్శకుడు ”జెఫ్రీ గీ చిన్” తెలుగు ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, నవదీప్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2020లో రిలీజ్ చేయాలనే ప్రయత్నించారు, కానీ covid-19 కారణంగా థియేటర్లు మూతపడటంతో 2021లో రిలీజ్ చేస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం మోసగాళ్లు. భారతీయ ఐటి పరిశ్రమలో ఒక కాల్ సెంటర్లో చోటు చేసుకున్న భారీ కుంభకోణం ఆధారంగా జరిగిన కథగా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ తో కొంతవరకు హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మోసగాళ్లు మూవీ కథకథనం:

ముందుగా స్టోరీలోకి వెళ్తే, ముంబై బస్తి కి చెందిన అక్క మరియు తమ్ముడు డబ్బు మీద ఇష్టంతో డబ్బును ఎలాగైనా సంపాదించాలనే కోరికతో తెల్లవారు అయిన అమెరికన్స్ దగ్గర చాలా డబ్బు ఉంటుందని భావించి వారిని మోసం చేయాలని అనుకుంటారు . వారి దగ్గర సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు దోచుకుంటారు. వారు చేసిన స్కామ్ నుంచి బయట పడ్డారా లేదా ఈ క్రమంలో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి వాటిని వారు ఎలా అధిగమించారు. చివరికి ఎలా బయటపడ్డారు అని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా విశ్లేషణ:

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, తొలిసారిగా కాజల్ అగర్వాల్, విష్ణు మంచు అక్క తమ్ముడు గా ఒక బంధం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాజల్ టాప్ హీరోయిన్ గా ఉన్న స‌మయంలో హీరోకు అక్కగా నటించడం ఆసక్తికరంగా మారింది. కథలో ఉన్న ఎమోషన్స్ కారణంగానే కాజల్ ఒప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచేది మంచు విష్ణు మరియు కాజల్ యాక్టింగ్ బ్రదర్ అండ్ సిస్టర్ గా వీరిద్దరు యాక్షన్ సినిమా మనల్ని ఆకట్టుకుంటుంది.

హాలీవుడ్ డైరెక్టర్ అయిన జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను కూడా హాలీవుడ్ స్థాయిలోనే డైరెక్ట్ చేశారని చెప్పవచ్చు. తాను తీసిన ఈ సినిమా హాలీవుడ్ మూవీ ని తలపించేలా విజువల్స్, షార్ట్స్ ఉంటాయి. హీరో విష్ణు పాత్రను ఏంతో అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమా లోని క్లైమాక్స్ సీన్ చాల అద్భుతంగా డైరెక్టర్ రూపొందించారు. సినిమా మొత్తానికి ఈ క్లైమాక్స్ సీన్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా చుసిన వారు కన్ఫర్మ్ గా క్లైమాక్స్ సీన్ కొన్ని సార్లు అయిన తలచుకుంటారు. హీరో వెంకటేష్ ఈ సినిమా కు వాయిస్ ని అందించారు. . పాన్ ఇండియా సినిమా రేంజ్ లో ఈ సినిమా ను తెరేకేక్కిన్చాలని అనుకోని డైరెక్టర్ మన తెలుగువారి నేటివిటీని పూర్తిగా ఈ సినిమాలో చూపించాలా ఇది సినిమాకు పెద్ద మైనెస్ అని చేపవచ్చు. ఈ సినిమా లోని పాటలు కూడా అంతగా బాగోలేదు.క్లైమాక్స్ కోసమే ఈ సినిమాను రూపొందించినట్టుగా ఉంది.

దర్శకులు హాలీవుడ్ వాడు అవటంవల్ల చిత్రం రిచ్ గా ఉన్నప్పటికీ, మన తెలుగు సినిమాల్లో మనం రెగ్యులర్ గా చూసే నేటివ్ ఎలిమెంట్స్ పెద్దగా కనబడవు. అయితే ఈ సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. హీరోయిన్ కాజల్ హీరోకి అక్క పాత్రలో నటించింది దీన్ని బట్టి సినిమా కథ ఎంత బలం అని మనం అర్థం చేసుకోవచ్చు.సినిమా చివరివరకు సస్పెన్స్ తో సాగుతుంది. దీనికి తగ్గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఆకట్టుకుంటుంది అయితే తెలుగుదనం కనిపించకపోవటం మైనస్ అలాగే కొన్ని సీన్స్ లాజిక్ కి అందవు.

ఇక నటీనటుల విషయానికి వస్తే అక్క మరియు తమ్ముడు గా నటించిన విష్ణు మరియు కాజల్ చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను అందరిని ఎంతగానో కట్టిపడేస్తుంది. సినిమాలో నటించిన నవీన్ చంద్ర మరియు నవదీప్ వాళ్ళ పాత్రలకు పూర్తీ న్యాయం చేకూర్చారు.సునీల్ శెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను బాగా మేపించారు. కాజల్ మరియు విష్ణు పోటాపోటీగా నటించారు. వారికి ధీటుగా నవీన్ చంద్ర, నవదీప్ పాత్రలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తొలిసారి తెలుగులో నటించారు. అయితే స్కామ్ ను శోధించే పోలీసాఫీసర్గా నటించారు. ఈ సినిమాకు సునీల్ శెట్టి యాక్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇంకా మిగతా వారు ఉన్నంతలో ఆకట్టుకున్నారు .

సాంకేతిక విషయాలు:

ముందే చెప్పినట్టు దర్శకడు జెఫ్రీ గీ చిన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ లోనే తీశాడు అని చెప్పవచ్చు. విజువల్స్ అన్న‌ ఆకట్టుకుంటాయి. అయితే సాధారణ తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చే విధంగా ఇక్కడ నేటివిటీని చూపించలేకపోయారు. ఇంకా మంచు విష్ణు దీనికి రచయిత గా కూడా పని చేసారు. విష్ణు తన పని తీరుకి న్యాయం చేశాడని చెప్పవచ్చు. శ్యామ్ సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా వరకు ఫ్రేమ్స్ రిచ్ గా కనిపిస్తాయి. గౌతం రాజు ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మొత్తంగా చూస్తే రొటీన్కి భిన్నంగా ఉంటూ, సస్పెన్స్ తో ఆకట్టుకునేలా ఉంది. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పవచ్చు. అయితే తెలుగుతనానికి దూరంగా ఉన్న ఈ మూవీ సాధారణ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

మోసగాళ్లు మూవీ రేటింగ్ : 2.5/5

x