కరోనా ఇప్పటివరకు 3 వేరియేషన్స్ ను చూపించింది. ఒక్కో వేవ్ ఒక్కో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ఈ కరోనా వేవ్స్ వల్ల నష్టపోయిన సినిమాలు ఇప్పుడు చూద్దాం.
బంగార్రాజు సినిమా సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న కరోనా కష్టాలు తప్పలేదు. సంక్రాంతికి పోటీ లేకుండా రిలీజ్ అయిన ఏకైక క్రేజీ మూవీ బంగార్రాజు. కరోనా ఆంక్షలు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రోజుకు నాలుగు ఆటలతో ఫుల్ ఆక్యుపెన్సీ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. పండక్కి వచ్చిన కొత్త హీరోలు పోటి ఇవ్వలేక పోవడంతో సినిమా సందడి అంతా బంగార్రాజు చుట్టూనే తిరిగింది.
నాలుగు రోజుల పాటు మంచి ఓపెనింగ్స్ వచ్చిన కరోనా ప్రభావం ఎక్కువ అవటంతో ఆడియన్స్ థియేటర్స్ కు రావాలంటే భయపడిపోయారు. దీంతో పండగ తర్వాత ఊహించని విధంగా కలెక్షన్స్ పడిపోయాయి. లేదంటే బంగార్రాజు 40 కోట్ల మార్క్ ను దాటి ఉండదని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కరోనా మూడవ దశతో బంగార్రాజు నష్టపోతే, సెకండ్ వేవ్ తో ‘రంగ్ దే’ సినిమా నస్టపోయింది. బంగార్రాజు మాదిరిగా వీకెండ్ లో దుమ్ము దులిపిన ఈ సినిమా కరోనా జోరు చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు చూడలేదు. దీంతో ఈ ఫ్యామిలీ మూవీ ఆదరణకు నోచుకోలేదు.
ఇక కరోనా ఫస్ట్ వేవ్ తో చిన్న సినిమా పలాస 1978 నష్టపోయింది. 2020 మార్చి 6న సినిమా రిలీజ్ అయ్యి ఓకే అనిపించుకుంటే ఈ లోగా 18 నుంచి లాక్ డౌన్ పడటంతో ఈ సినిమాకు రావాల్సినంత క్రేజ్ రాలేదు.