హీరో సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఇటీవల ఓటీటీ లో విడుదలయ్యి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అతను ‘తిమ్మరుసు’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా హాళ్లు ఓపెన్ అయినప్పటికీ తెరపై మాత్రం ఇంకా బొమ్మ పడలేదు. దీనికి కారణం జనాల్లో ఇంకా కరోనా భయం పోలేదు. కానీ, మూవీ మేకర్స్ ఒక అడుగు ముందుకు వేసి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు మరియు యర్రబోలు సృజన నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీ చరణ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ మరియు అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

x