నవ్వడం ఒక వరం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల. సినిమా, టీవీ షోల ద్వారా మనల్ని ఎంతగానో నవ్వించి మనకున్న చిన్ని కష్టాలను కాసేపు మర్చిపోయేలా చేస్తారు కమెడియన్స్. అలాంటి వాళ్ళలో రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్ ఒకరు. ఈ పేరు చెబితే మీరు గుట్టు పట్టకపోవచ్చు. కానీ మిస్టర్ బీన్ అంటే మాత్రం తక్కున గుర్తుపడతారు. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను నవ్వించి మన అందరిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్. మాటలు లేకుండా తన ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే మన నవ్వుకి కారణమయ్యాడు. అసలు ఈ రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్ ఎవరు? అతను మిస్టర్ బీన్ గా ఎలా మారాడు? అతను మాట్లాడలేని షోలు చేయడానికి గల కారణాలు ఏమిటి? మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mr.Bean Childhood:

Mr Bean childhood images

రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్ జనవరి 6 1955 న ఇంగ్లాండ్లో జన్మించాడు. అతని తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్, తల్లి హౌస్ వైఫ్, వాళ్లకి ముగ్గురు పిల్లలు. రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్ మూడో వాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు చకచకా మాట్లాడుతూ యాక్టివ్ గా ఉంటే రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్ మాత్రం చిన్నప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు. దీనికి కారణం సెలెక్టివ్ ముటిస్యూమ్. ఇది చిన్న పిల్లల్లో వచ్చే ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా మాట్లాడారు.రోవెన్ చిన్నప్పుడు టీవీ లో ఒక ప్రోగ్రాం వచ్చేది, అది మాటలు లేని ఒక మూఖి షో. ఆ కామిక్ మూఖి షో చూడటానికి రోవెన్ చాలా ఇష్టపడేవాడు. అయితే ఫీచర్లో తను కూడా అలాంటి షోలు చేస్తానని రోవెన్ ఎప్పుడూ అనుకోలేదు.

Mr.Bean studies & Stage Performance :

రోవెన్ చదువుకొని ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా స్థిరపడాలని అనుకునేవాడు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మాస్టర్ డిగ్రీ లో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చేయాలని అనుకున్నాడు. అలా MSE కోసం ఆక్స్ఫర్డ్ లోని క్వీన్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. అలా కాలేజీలో జాయిన్ అయ్యాక స్టూడెంట్స్ అందరూ ఓన్ గా ఒక స్క్రిప్ట్ రాసి ప్రదర్శించాలని కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పండి. రోవెన్కి చాలా నాటకాల్లో నటించిన ఎక్స్పీరియన్స్ ఉన్న సొంతంగా స్క్రిప్ట్ రాసి ఎప్పుడు వేయలేదు. ఇది అతనికి కొంచెం కష్టంగా అనిపించింది.

అప్పుడు రోవెన్కి తన చిన్నప్పుడు చూసిన మోఖి షో గుర్తుకు వచ్చింది. తమ స్నేహితుడు రిచర్డ్ తో దాని గురించి చెప్పాడు. రిచర్డ్ క్యారెక్టర్ ఒక రైటర్ ఈ ఐడియా రిచర్డ్కి కూడా నచ్చడంతో ఒక ముఖి స్క్రిప్ట్ ను రాసుకొని ప్రజెంట్ చేశారు. రోవెన్ సెబాస్టియన్ అట్కిన్సన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఆ స్కిట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి స్టేజ్ షో లను ఇంకా చేయాలని రోవెన్ మరియు రిచర్డ్ డిసైడ్ చేసుకున్నారు. వీళ్లకి హ్యావిడ్ అనే వ్యక్తి మ్యూజిక్ కంపోజ్ చేసే వాడు.

Mr.Bean First TV Show In BBC :

రోవెన్ చేసిన స్టేజ్ షో లు హిట్ కావటంతో చాలా టీవీ షోలు నుంచి ఆఫర్స్ వచ్చాయి. అలా BBC నుంచి టీవీ షో కి ఆఫర్ వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ గురించి రోవెన్ చాలా ఆలోచించి, టీవీ షోలో చేస్తే బయట చేసే ప్రోగ్రామ్స్ వదులుకోవాల్సి వస్తుందని చాలా ఆలోచించాక, టీవీ షోలో తన కెరీర్ బాగుంటుందని భావించి టీవీ షో చేయడానికి ఒప్పుకున్నాడు. BBC లో తన మొదటి టీవీ షో కి సైన్ చేశాడు. రోవెన్ చేసిన మొదటి టీవీ షో పేరు “NOT THE 9 ‘0’ CLOCK NEWS ” ఈ షో సూపర్ సక్సెస్ అయింది.

టీవీ ద్వారా రోవెన్ చాలా మందికి పరిచయం అయ్యాడు. ముఖాన్ని రకరకాలుగా పెట్టి రోవెన్ చేస్తున్న యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. తనలో ఉన్న లోపమే తన ప్రొఫెషన్ అవుతుందని రోవెన్ అప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత చాలా టీవీ షోలు చేశాడు. తన స్నేహితుడు రిచర్డ్ రాసిన స్క్రిప్ట్ తో ఒక న్యూ షో ని స్టార్ట్ చేశాడు అదే “బ్లాక్ ఆర్డర్”. ఈ బ్లాక్ ఆర్డర్ టీవీ షో కూడా చాలా పెద్ద హిట్ అయింది. దీనితో దానికి సీక్వెల్స్ చేశారు. ఈ బ్లాక్ ఆర్డర్ సిరీస్ బ్రిటన్ లోనే బెస్ట్ సిరీస్ గా నిలిచింది. దీనితో రోవెన్కి తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

విజువల్ కామెడీ అంటే మాటలు లేకుండా కేవలం హావభావాలతో ప్రేక్షకులను నవ్వించడం. రోవెన్ చేసిన ఫుల్ లెన్త్ మూవీ షో “చీటింగ్” ఇందులో మాటలు ఉండవు. రోవెన్ ఒక ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లి అక్కడ కాఫీ కొట్టి చీటింగ్ చేస్తాడు. ముఖి షో లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మాటలు ఉండవు కాబట్టి ఏ భాష వాళ్ళు చూసిన అర్థమైపోతుంది. దీనితో రోవెన్ విజువల్స్ కామెడీ షో కి క్రేజ్ ఆకాశమంత పెరిగింది.

Mr.Bean Got The First Silver Screen Opportunity :

టీవీ తెర పైన పాపులర్ అయిపోయిన రోవెన్ కి సిల్వర్ స్క్రీన్ అవకాశం వచ్చింది. అదికూడా జేమ్స్ బాండ్ సినిమాలో, రోవెన్ తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది ఒక జేమ్స్ బాండ్ సినిమాలో, రోవెన్ ఈ సినిమాలో ఒక పాత్రను చేశాడు సాధారణంగా రోవెన్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి అభిమాని ఆ తర్వాత “డేడ్ ఆన్ టైం” ఇంకా కొన్ని సినిమాల్లో నటించాడు.1997లో “ది అల్టిమేట్ డిజాస్టర్” మూవీ లో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ముందే చెప్పుకున్నట్లు రోవెన్ కు జేమ్స్ బాండ్ సినిమాలంటే చాలా ఇష్టం. జేమ్స్ బాండ్ పాత్రలో నటించాలని ఉండేది. దీంతో జేమ్స్ బాండ్ తరహా లో ఒక పాత్ర సృష్టించుకొని “జానీ ఇంగ్లీష్” అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా “జానీ ఇంగ్లీష్ రెబొర్న్” సినిమాను తీశారు.

ఒక యానిమేటెడ్ సినిమా కోసం ఒక పక్షికి కూడా డబ్బింగ్ చెప్పాడు. అలా టీవీ స్క్రీన్స్ తో పాటు సినిమా స్క్రీన్ లపై కూడా ఒక వెలుగు వెలిగారు. ఏం చేసినా సూపర్ హిట్, ఏం తీసినా సక్సెస్, ఏ రంగంలో అడుగుపెట్టిన తిరుగులేదు. రియల్ ఎస్టేట్స్ లో కూడా సక్సెస్ సాధించాడు. ఎంత ఉన్నా ఎంత చేసినా ఏదో వెలితి ఎందుకో తెలియని ఒక చిన్న లోటు ఇంకా ఏదో చేయాలి ఇంకా చాలా మందిని నవ్వించాలి అన్న ఆలోచన రోవెన్ది.

Full Length Mr.Bean Show :

పూర్తి స్థాయిలో ఒక ముఖి షో ని చేయాలి అని అనుకున్నాడు. ఈ కాన్సెప్ట్ పట్టుకొని చాలా చానల్స్ తిరిగాడు. అతను ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయిన ఆ ఫుల్ లెంత్ ముఖి షో చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. ఆ షో ని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సమస్య కంటే సంకల్పం గొప్పది. ఎవరు ఒప్పుకోకపోవడంతో ఆ ముఖి షో ని తానే నిర్మించాలని అనుకున్నారు. అదే “మిస్టర్ బీన్” ఈ షో కి రచయిత, నిర్మాత, దర్శకుడు, నటుడు అన్ని రోవెనే.

ఒక జోక్ చెప్తే మనం కొంత సేపు మాత్రమే నవ్వగలం, అదే ఒక క్రిటికల్ సిట్యువేషన్ ని క్రియేట్ చేసి ఆ సిట్యువేషన్ నుంచి బయటపడటానికి మిస్టర్ బీన్ పడే పాట్లు, చేసే పనులు అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. మాటలు లేవు కాబట్టి ఏ భాష వారైనా ఇది చూడచ్చు మిస్టర్ బీన్ షో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అన్ని భాషల వారికి రీచ్ అయ్యింది. మౌనం ప్రపంచభాష కదా, మిస్టర్ బీన్ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం మాటలు లేకపోవడమే, రోవెన్ ఇచ్చే ఫన్నీ ఎక్స్ప్రెషన్ అతను ఇరుక్కునే సిల్లీ ప్రాబ్లమ్స్ అమితంగా ఆకట్టుకున్నాయి1980లో మిస్టర్ బీన్ షోని దాదాపు రెండు కోట్ల మంది పబ్లిక్ చూశారు. అది అప్పట్లో ఒక పెద్ద రికార్డు. ఆ షో సక్సెస్ అవ్వదు అనుకున్న వాళ్లు అంతా షో యొక్క రైట్స్ కోసం ఎగబడ్డారు.

Mr.Bean Marriage :

Mr Bean wife sunetra sastry

ఇది స్క్రీన్ మీద మనకు తెలిసిన మిస్టర్ బీన్ కదా అయితే ఆఫ్ స్క్రీన్ మిస్టర్ బీన్ వేరు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అతను కు సెలెక్టివ్ ముటిస్యూమ్ అనే వ్యాధి ఉండేది. ఆ వ్యాధి వల్ల అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ చిన్నప్పటి నుంచే తన ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ తో చుట్టుపక్కల వారిని నవ్వించాడు మిస్టర్ బీన్ భార్య పేరు సునేత్ర శాస్త్రి ఈమె తండ్రి భారతీయుడు, తల్లి బ్రిటన్ సిటిజెన్. వీరిద్దరు కొంతకాలం డేటింగ్ చేశాకా పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి ఇద్దరు పిల్లలు, అయితే కొన్ని కారణాల వల్ల రోవెన్ సునేత్ర లు ఇద్దరు 2014లో విడాకులు తీసుకున్నారు

Mr.Bean Car Assident :

ఇకపోతే రోవెన్ కి కార్లు అంటే పిచ్చి, చాలా రకాల కారులు అతని దగ్గర ఉండేవి, అలాగే రేసింగ్ అంటే కూడా ఇష్టం, రోవాన్ దగ్గర స్పోర్ట్స్ కార్లు కూడా ఉండేవి. ఒకసారి రోవాన్ తన కారులో వెళుతుండగా ఒక యాక్సిడెంట్ జరిగింది, రోవాన్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది.

Mr.Bean Also Pilot :

Mr Bean biography in telugu

అలాగే రోవెన్ పైలెట్ కూడా, ఒకసారి తన ఫ్యామిలీతో కలిసి‌ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఒక ట్రిప్ కి బయలుదేరాడు. అప్పుడు ఫ్లైట్ పైలెట్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు అప్పుడు రోవెన్ అతని పక్కన కూర్చోబెట్టి తనే ఫ్లైట్ ను నడిపాడు. పైలెట్ కి తిరిగి మెలుకువ వచ్చేవరకు ఫ్లైట్ ని గాలిలో నడిపాడు. తర్వాత పైలెట్ నెమ్మదిగా లేచి ఫ్లైట్ ను సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ప్రస్తుతం మిస్టర్ బీన్ కు 66 సంవత్సరాలు హ్యాపీ గా తన ఇంట్లో కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. మాటలు లేని ఒక షో ద్వారా కోట్ల మందిని నవ్వించడం అనేది మామూలు విషయం కాదు చార్లీ చాప్లిన్ తర్వాత ఆ కోవలో అంతగా నవ్వించిన వ్యక్తి రోవెన్.

x