భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. కార్స్ మరియు బైకులన్నా అంటే ఇష్టం. వాటి కోసమే ఓ ప్రత్యేక గ్యారేజీ ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనిలో తాను సేకరించిన బైక్స్ మరియు కార్స్ ను పెడుతూ ఉంటారు. ఖరీదైన హమ్మర్ కార్స్ (hummer) నుండి పోర్స్చే (Porsche) వంటి టాప్ స్పీడ్ కార్ల వరకు ధోనీ సేకరణలో భాగమే. ఇప్పుడు, తన గ్యారేజీ లోకి ఓ పాతకాలపు కారును తీసుకురాబోతున్నాడు.

గత నెల డిసెంబర్ 19న గురుగ్రామ్‌లోని బిగ్ బాయ్ టాయ్స్ షోరూమ్‌ పాతకాలపు మరియు క్లాసిక్ కార్ల ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలం జనవరి 8న ముగిసింది. ఈ ఆన్‌లైన్ వేలంలో MS ధోని 1970 నాటి అరుదైన ల్యాండ్ రోవర్ సిరీస్ 3 ని కొనుగోలు చేశాడు.

ఈ కార్ 1971 మరియు 1985 మధ్యకాలంలో వచ్చిన ల్యాండ్ రోవర్ సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఇది కూడా ఒకటి. ధోని కొనుగోలు చేసిన ఈ కారు ఐదు దశాబ్దాల నాటిది. ఈ కారు 2.25 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ బాక్స్‌తో నడుస్తుంది. 50 శాతానికి పైగా కార్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా అమ్మినట్లు బీబీటీ షోరూం తెల్పింది.

x