అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు తమ కూతురికి పెట్టిన పేరును అందరికి తెలియజేసారు. విరుష్క
దంపతులు తమ కుమార్తెకు “వామిక” అని పేరు పెట్టినట్టు అధికారంకంగా ప్రకటించారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న ఫొటోలో తమ బిడ్డను ప్రేమగా చూస్తూ ఉండడాన్ని గమనించగలరు.
బిడ్డ పుట్టటం తమకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తల్లిదండ్రులుగా తాము మరో కొత్త లెవెల్కి చేరుకున్నామని తెలిపారు. అనుష్క శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో, తన భర్త విరాట్ కోహ్లీ, కుమార్తె వామిక తో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసారు.
“ప్రేమతో కలిసి ఉన్నాం, ప్రేమతో బ్రతికి ఉన్నాం, వామిక మన జీవితంలోకి రాగానే మరో మెట్టుకి మనం ఎదిగాము. కన్నీళ్లు, నవ్వు, బాధ, ఆనందం అన్ని కొన్ని క్షణాల వ్యవధిలోనే తన వల్ల చూడగలిగాం.” అని చెప్పుకొచ్చారు.
అనుష్క శర్మ తన అభిమానులకి కూడా థ్యాంకు యు అని తెలిపారు. మీ అందరి శుభాకాంక్షలకి, ప్రార్థనలకు, మంచి ఎనర్జీకి ధన్యవాదాలు చెప్తున్నానని అనుష్క శర్మ పోస్ట్ ద్వారా తెలిపారు.
ఎంతో ప్రేమానురాగాలు నిండిన మా జీవితాల్లో, వామిక ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను
తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు, కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. కానీ మాపై చూపిన ప్రేమానురాగాలకు, మరియు మా క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
జనవరి 11న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు ఆడ బిడ్డ పుట్టింది. ముంబైలోని క్యాండీ బీచ్ హాస్పిటల్లో అనుష్క శర్మ జన్మనిచ్చింది. తమ జీవితంలోకి పాప ప్రవేశించిందని, అనుష్క శర్మ, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ పోస్ట్ పెట్టారు. తమకు తమ బిడ్డకు ప్రైవసీ ఇవ్వాలని కూడా ఈ దంపతులు మీడియాని కోరారు. బిడ్డ ఫోటోలను తీయకండి అని కోరుతూ వచ్చారు.