Naandhi Movie Review in Telugu
కామెడీ హీరోగా అదరకొట్టిన అల్లరి నరేష్ కు ఈ మధ్య సరైన హిట్స్ పడటంలేదు. దీనితో కామెడీని కాస్త పక్కన పెట్టి వైవిధ్యమైన పాత్రలో, విలక్షణమైన కథతో నాంది అనే సినిమా చేసారు. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.
గతంలో గమ్యం, ప్రాణం లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లాంటి సినిమాలలో నటించి సత్తా చాటిన నరేష్, నాంది అనే ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అల్లరి నరేష్ కెరీర్ లో 57వ సినిమాగా రాబోతున్న నాంది సినిమాతో విజయ కనకమేడల దర్శకుడుగా పరిచయం అవబోతున్నాడు. SV2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియా దర్శి, దేవి ప్రసాద్, వినయ్ వర్మ, సిఎల్ నరసింహ రావు, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. మరి అల్లరి నరేష్ తాను ఎప్పుడూ తీసే కామెడీ సినిమాలకు భిన్నంగా, విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్ విజయాన్ని అందుకున్నాడా? లేదా? అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా కథ విషయానికి వస్తే, ఇక మనకు తెలిసిన విషయమే అయినా, తెలియని కోణాన్ని బయట పెట్టిన కథ అని చెప్పవచ్చు. వ్యవస్థలోని లోపాలాలని బయట పెట్టే ప్రయత్నం చేసిన చిత్రం ఇది.
సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్) ఒక సాధారణమైన పౌరుడు, తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతూ, నచ్చిన అమ్మాయితో పెళ్ళికి సిద్ధమవుతాడు. ఇలా సరదాగా సాగిపోతున్న అతని లైఫ్ లోకి అనుకోని అవాంతరాలు చుట్టుముడతాయి.
రాజా గోపాల్ అనే వ్యక్తిని హత్య చేసాడని సూర్య ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాజా గోపాల్ హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వినరు. ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే నేరానికి ఈ సూర్య ప్రకాష్ ని ఎందుకు అరెస్ట్ చేసారు? ఈ కేసులో అతనికి న్యాయం జరిగిందా? అతనికోసం వాదించడానికి వచ్చిన న్యాయవాది ఎవరు? జైలుకి వెళ్లడం వల్ల తన వ్యక్తిగత జీవితం లో కోల్పోయింది ఏమిటీ? తనని తాను రక్షించుకోడానికి సూర్య ప్రకాష్ చేసిన ప్రయత్నాలు ఏమిటీ? ఎవరికి తెలియని లీగల్ సెక్షన్ 211 లో ఏముంది? అనేదే ప్రధానంగా కథ సాగుతుంది.
Naandhi Movie Analysis
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తనకి సంబంధం లేని ఒక కేసు తన మీద వేసి, జైల్లో పెట్టి 5 ఏళ్ళు అవుతున్న విడుదలకి నోచుకోని వ్యక్తిగా అల్లరి నరేష్, తనని కాపాడే లాయరుగా వరలక్ష్మి పాత్రలు ప్రదానంగా సినిమా సాగుతుంది.
దేశంలోని కొన్ని జైళ్లు గురించి ఒక వాయిస్ ఓవర్ లో చెప్తున్నా సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. నరేష్ జైలుకి వెళ్లడం, అక్కడ వచ్చే సీనులు సినిమాపై ఆసక్తిని పెంచుతుంటాయి. తన కథని ప్రియదర్శితో చెప్పేవరకు సినిమా ఒక దారిలో సాగిపోతూ అలరిస్తుంది. ఆ తర్వాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అక్కడ కొంచెం రొటీన్ అనిపిస్తుంది. అనంతరం అతను చేయని ఒక క్రైమ్ విషయంలో పోలీసులు అతడిని పెట్టుకోడం, కొన్ని పోలీస్ స్టేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి.
ఆ తర్వాత జైలు నుండి బయటకి రావడానికి నరేష్ ప్రయత్నించడం. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీతో సినిమా ఊపు అందుకుంటుంది. ఒక ఆసక్తికర ట్విస్టుతో ఇంటర్వెల్ బ్రేక్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ప్రథమార్ధం ముగిసేటప్పటికీ, ఓ డార్క్ థీమ్ లో కనిపిస్తూ సినిమా ఇంట్రెస్టింగా అనిపిస్తుంది.
అలాగే అల్లరి నరేష్ తన రోల్ ను అద్భుతంగా కనిపించాడు. ఇంకా ద్వితీయార్ధంలో ఒక్కో సస్పెన్స్ రివీల్ అవుతూ వస్తుంది. ఇక హీరోపై చూసే ఆడియన్స్ కి కూడా సింపతీ పెరుగుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తన రోల్ లో సూపర్బ్ గా కనిపిస్తూ, కోర్ట్ సన్నివేశాలకి ప్రాణం పోస్తుంది.
ఆయా సన్నివేశాలు సూపర్ అనిపిస్తాయి. వరలక్ష్మి నరేష్ ను కాపాడటానికి చేసే ప్రయత్నాలు బాగున్నాయి. ఎమోషన్స్, బాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్, అన్ని కూడా చక్కగా కుదిరాయి. చేయని నేరానికి జైలుకి వెళ్లిన వ్యక్తి జీవితాన్ని బాగా చూపించారు.
అలాగే వ్యవస్థలో లోపాలను బయటపెట్టే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. అయితే నరేష్ సినిమాల తరహా కామెడీ ఎక్కడ కనిపించదు. ఆడియన్స్ కూడా దానిని కోరుకోకపోవడం సినిమాకి బలమే. నరేష్ చేసిన ఈ ప్రయత్నం చాల వరకు అలరిస్తుంది. ఎవరికీ తెలియని లీగల్ సెక్షన్ 211 ను చూపిస్తూ ఒక మెసేజ్ ని కూడా ఇవ్వడం ఆకట్టుకుంటుంది.
ఇక నటన పరంగా నరేష్ ఒక రేంజ్ పెర్ఫార్మన్స్ చూపించారు. కామెడీ మాత్రమే కాదు, ఎలాంటి పాత్ర అయినా పోషించగల నటుడుగా తనని తాను మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల జయమ్మగా ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ గా సూపర్ నటనను కనబరిచారు.
ఇక ప్రియదర్శి, దేవి ప్రసాద్ వంటి వారు ఉన్నంతలో మెప్పించారు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్, తన నటనతో సెకండ్ హాఫ్ లో కీలకంగా నిలిచారు. హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు, ఉన్నంతలో ఓకే. మిగతావారు పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసారు.
Naandhi Movie Direction
ఇక దర్శకుడు, ఇతర సాంకేతర విషయాలకు వస్తే, డైరక్టర్ విజయ్ కనకమేడ, ఒక విభిన్న కథని ఎంచుకొని దానిని తెరపై చూపించడంలో విజయవంతం అయ్యారు. ఇక సినిమాకి శ్రీచరణ్ పాకల మ్యూజిక్ బలంగా మారింది. బీజీమ్ సూపర్ అనేలా ఉంది. చాలా సన్నివేశాలకు సంగీతం ప్రాణం పోసింది. ఇక సిద్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
జైల్లో సన్నివేశాలను బాగా చూపించారు. ఇక సినిమాకు మాటలు ప్లస్ అయ్యాయి. ఆయా సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ ఆలోచింపచేసేలా ఉంటాయి. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ సినిమా అల్లరి నరేష్ కెరీరుకి ఉపయోగపడేలా, ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు.
Naandhi Movie Rating
నాంది మూవీ రేటింగ్ 3.5/5