అమెజాన్ ప్రైమ్ వీడియో లో నాగచైతన్య తొలి వెబ్ సిరీస్‌ రానుంది. అతి త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. నివేదికల ప్రకారం, ఈ వెబ్ సిరీస్ హర్రర్ డ్రామాగా తెరకెక్కనుంది. దీనిని క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి.

ఆగస్టులో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, నాగచైతన్య విక్రమ్ తో థాంక్స్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. వీరి కాంబినేషన్లో ఇంతకముందు మనం అనే సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వీరి కలియకలో థాంక్స్ అనే సినిమా రానుంది. దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ హర్రర్ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.

‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే చాట్ షోలో నాగచైతన్య యాంకర్ ప్రదీప్ తో మాట్లాడుతూ, హర్రర్ మూవీస్ అంటే నాకు చాలా భయమని అందుకే వాటిని చూడటం మానేసానని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఒక హర్రర్ వెబ్ సిరీస్ తో నాగచైతన్య మన ముందుకు రానున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య, అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్నారు. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో పాటు నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ తెరకెక్కిస్తున్న ‘థాంక్స్’ అనే సినిమాలో అవికాగోర్ మరియు మాళవిక నాయర్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఈ సినిమా 2021 చివరి నాటికి విడుదల కానుంది. మరోవైపు, నాగ చైతన్య శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది.

x