తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని నెలల క్రితం సమంత మరియు నాగచైతన్య విడాకుల విషయం పై భారీగా చర్చనీయాంశమైంది. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోయారో ఇంతవరకు ఎవరికీ సరిగ్గా తెలియదు. దీంతో సోషల్ మీడియా లో చాలా మంది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకున్నారు. అయితే, అక్కినేని నాగ చైతన్య కూడా ఈ విడాకుల పై బహిరంగంగా ఎక్కడ స్పందించలేదు.
తాజాగా బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. మీడియా ఇంటరాక్షన్ సమయంలో విడాకులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి మొదట అంగీకరించకపోయినా, మీడియా చాలా సార్లు అడగడంతో ఆ విషయం గురించి చెప్పాల్సి వచ్చింది.
నాగ చైతన్య మాట్లాడుతూ, ” విడాకులు అనేది మా ఇద్దరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇద్దరి మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని.. అయితే, విడాకుల నిర్ణయంతో తామిద్దరం హ్యాపీగా ఉన్నామని” ఆయన చెప్పుకొచ్చారు.