యువ దర్శకుల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల్లో మరియు పరిశ్రమ లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ప్రశాంత్ వర్మ నాగార్జున ను డైరెక్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో కోసం స్టార్ మా యాజమాన్యం ప్రశాంత్ వర్మ ను సంప్రదించారు. దీంతో ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో ఈ ప్రోమోకు దర్శకత్వం వహించారు.

స్టార్ మా ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో కు మంచి స్పందన వచ్చింది. ”బోర్ డమ్ కి చెప్పేయ్ గుడ్ బై… వచ్చేసింది మీ బిగ్ బాస్…” అంటూ ఈ సీజన్ యొక్క ప్రమోషన్ ను గ్రాండ్ గా మొదలుపెట్టారు. గతంలో రెండుసార్లు హోస్ట్ గా చేసిన నాగార్జున ఈ సీజన్కి కూడా హోస్ట్ గా చేయనున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 పూర్తయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు పూర్తి బోర్ గా ఫీల్ అవుతున్నట్లు ఈ ప్రోమో కనిపిస్తుంది. ఆ సమయంలో నాగార్జున ఒక గన్ తో ఎంట్రీ ఇచ్చి ప్రజల యొక్క బోర్ ను దూరం చేస్తూ త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 రాబోతుందని చెబుతారు. నాగార్జున చివర్లో చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది.

దీన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నాగార్జునకు థాంక్స్ అంటూ ప్రశాంత్ వర్మ ఇటీవల ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ అనే సూపర్ హీరో మూవీతో బిజీగా ఉన్నారు.

x