హీరో నందమూరి కళ్యాణ్ రామ్ రెండు రోజుల క్రితం వశిస్ట్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు NTR యొక్క జయంతి సందర్భంగా సినిమా టైటిల్ మరియు మొదటి లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు “బింబిసార” అనే టైటిల్ ను దృవీకరించారు. ఇంత వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా కళ్యాణ్ రామ్ ఈ బింబిసార చిత్రంలో కనిపించారు.
ఈ ‘బింబిసార’ చిత్రం టైమ్ ట్రావెల్ మరియు సోషల్ ఫాంటసి కలిగి ఉంది. పోస్టర్లో కళ్యాణ్ రామ్ మృతదేహాల కుప్ప పైన కూర్చుని కనిపించారు. విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే సినిమా పై అంచనాలను పెంచుతుంది.
ఈ చిత్రంతో వశిస్ట్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు మరియు కేథరీన్, సమ్యూక్తా మీనన్ ఈ సినిమాలో నటించనున్నారు. హరి కృష్ణ కె ఎన్‌టిఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ‘బింబిసార’ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతాన్ భట్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చనున్నారు.