నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మరియు నేచురల్‌ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ’ సినిమాలు డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఓటిటి విడుదల కాబోతున్నాయి.

ఈరోజు రాత్రి 12 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగరాయ’ సినిమా ప్రసారం కానుంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి మరియు సాయి పల్లవి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో ‘శ్యామ్ సింగరాయ’ పాత్రలో నాని అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. సాయి పల్లవి కూడా తన పాత్రలో అద్భుతంగా నటించింది. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది.

మరోవైపు, రేపు సాయంత్రం 6 గంటలకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో ‘అఖండ’ సినిమా ప్రసారం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. 2021 వ సంవత్సరం వచ్చిన అతి పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 103 సెంటర్లో విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా OTT దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.

x