ఖమ్మం జిల్లాలో కరోనా వల్ల కొత్తగా పెళ్లయిన నవవధువు మృతి చెందింది. పెళ్లి అయ్యి నెల రోజులు గడవక ముందే ఆమె చనిపోయింది. పెళ్లి సందడి మర్చిపోకముందే కరోనా తో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, పార్థసారథి పురం లో ఈ విషాదం చోటుచేసుకుంది. విజయ అనే మహిళా అదే గ్రామానికి చెందిన బాలకృష్ణతో గత నెల 17వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగిన 25 రోజుల తర్వాత విజయ కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ ఏరియా హాస్పిటల్ లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆమె కొద్ది రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంది. అయితే పరిస్థితి విషమించడంతో ఖమ్మం లోని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 15న ఆమె చనిపోయింది. నవ వధువు మృతి తో గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె కాళ్ళ పారాణి ఆరకముందే కరోనా భారిన పడి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విజయ మృత దేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ గ్రామంలో కరోనా వల్ల ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

x