దేశంలో కరోనా విజృంభిస్తుంది, ప్రధానంగా మహారాష్ట్రలో రోజుకు 10,000 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనితో నాగపూర్ ప్రాంతం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. మరిన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు మహారాష్ట్ర సి.ఎం ఉద్ధవ్ థాక్రే.
కరోనా విజృంభిస్తున్న సందర్భంలో కూడా, వాక్సిన్లు వచ్చాయని ధీమాగా ఉండే సరికి మళ్ళి కరోనా పంజా విసురుతుంది. దేశంలో వెలుగుచూస్తున్న కేసులో ఎక్కువ భాగం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులలోనే నమోదు అవుతున్నాయి. తాజా కేసుల్లో సుమారు 86% కేసులు ఈ రాష్టాలలోనే వెలుగు చూశాయి అని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 24,882 కొత్త కేసులు వెలుగు చూశాయి. సుమారు రెండు నెలల తరువాత ఈ స్థాయి కేసులు బయటపడ్డాయి. 140 మంది ప్రజలు చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది, కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది, ఒక మహారాష్ట్రలోనే 10,000 కు పైగా కేసులు నమోదు అవ్వడం అందరికి ఆందోళన కలిగేస్తుంది.
దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాజాగా నాగపూర్ జిల్లాలో 7 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నాగపూర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రాంతం పూర్తిస్థాయి లాక్ డౌన్ లోకి వెళ్లనుంది అని మంత్రి మిథిన్ రావు తెలిపారు.
అత్యవసర సేవలకు అంతరాయం ఉండదన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఏడు పాయింట్ల కార్యాచరణ ప్రణాలికను రూపొందిచింది. వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, హాట్ స్పాట్స్ లో మాస్ టెస్టింగ్, వైరస్ సోకినవారి సన్నిహితులను పరీక్షించడం లాంటి పలు అంశాలను ప్రణాళికలో పొందుపరిచింది.
మరో వైపు రాష్టంలో కరోనా వత్తిడి కట్టడి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ప్రస్తుతానికి రాష్టంలో కరోనా పరిస్థితులు ఇంకా అదుపుతప్పలేదన్న ఉద్ధవ్, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్ డౌన్ నిబంధనలు విధిస్తామని అన్నారు.