రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ దేశంలోని 8 రాష్ట్రాలకు గవర్నర్ల ను నియమించారు. దీనిలో ఏపీకి చెందిన బీజేపీ నేత.. మాజీ లోక్ సభ సభ్యుడు అయిన ‘కంభంపాటి హరిబాబు’ ను మిజోరాం నూతన గవర్నర్‌గా నియమించారు. ఆయన విశాఖపట్నం నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా 2014-19 వరకు పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా బదిలీ చేశారు.
మిజోరాం గవర్నర్‌గా ఉన్న పీఎన్ శ్రీధరన్ పిళ్లైను బదిలీ చేసి గోవా గవర్నర్‌గా నియమించారు. హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ను బదిలీ చేసి త్రిపుర కొత్త గవర్నర్‌గా నియమించారు. త్రిపుర గవర్నర్ రమేష్ బయస్ ను బదిలీ చేసి ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు. కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లట్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించారు. మంగు భాయ్ పటేల్ ను మధ్య ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. రాజేంద్ర విశ్వనాథ్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు.
1. మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
2. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ
3. మధ్య ప్రదేశ్ గవర్నర్ గా మంగు భాయ్ పటేల్
4. గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లై
5. కర్ణాటక గవర్నర్ గా థావర్ చంద్ గెహ్లట్
6. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్
7. త్రిపుర గవర్నర్ గా సత్య దేవ్ నారాయణ
8. ఝార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బయస్