కన్నడ సినిమా రేంజ్ ను మార్చేసిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజిఎఫ్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. 2018 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన కేజిఎఫ్ పార్ట్ 1 ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటిదాకా ఇతర భాషల సినిమాలను చూసి మురిసిపోయిన కన్నడ ప్రేక్షకులు కూడా తమ సినిమాకు మంచి క్రేజ్ రావడంతో ఆనందంలో మునిగిపోయారు.

ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మరియు హీరో యశ్ కు కూడా అనేక అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే యశ్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ కూడా తెలుగులో రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. తెలుగులో టాప్ హీరోలు అయినా ఎన్టీఆర్ తో ఒక సినిమా మరియు ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అయితే కేజిఎఫ్ 2 విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ మళ్లీ మారే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కరోనా రెండవ దశ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ నెలలో క్రిస్టమస్ సీజన్లో విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి 2018 లో పార్ట్1 కూడా అదే సీజన్లో రిలీజ్ చేయగా క్రిస్టమస్ సెలవులు బాగా కలిసి వచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ ఈసారి కూడా అలాగే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈసారి అల్లు అర్జున్ సినిమా పుష్ప కూడా క్రిస్టమస్ కి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వార్ తప్పదు.

x