నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. నిహారిక భర్త చైతన్య ఒక ఆఫీస్ పెట్టడం కోసం బంజారాహిల్స్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. అయితే, ఆ ప్లాట్ లో ఆఫీస్ పెట్టకూడదని అపార్ట్మెంట్ వాసులు చైతన్య తో గొడవకు దిగారు‌. ఈ క్రమంలోనే ఇరువురు మధ్య గొడవ జరిగింది.

అపార్ట్మెంట్ వాసులు తమ ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి గొడవ చేశారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా కొంతమంది యువకులు ఆ ప్లాట్ కు వచ్చి మద్యం సేవించి గొడవ చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు చైతన్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇరువురు రాజీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ గొడవ పై చైతన్య ఓ క్లారిటీ ఇచ్చాడు. తను ఫ్లాట్ తీసుకున్న పర్పస్ ఓనర్ కి చెప్పానని అయితే, అపార్ట్మెంట్ వాసులకు ఆ విషయం తెలియక పోవడంతో ఈ గొడవ జరిగిందని చైతన్య చెప్పుకొచ్చారు.

x