కరోనా రోజుకో రూపం మార్చుకుంటూ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ కు సవాల్ విసురుతుంది. ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్స్ ప్రజల పై దండయాత్ర చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తుంటే, మరోపక్క కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే డెల్టా, ఓమిక్రాన్ వంటి కొత్తరకం వైరస్లు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మరోపక్క ఇంకో వేరియంట్ పుట్టుకు వచ్చింది.

కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలను మరియు సాధారణ జనం నుంచి కొన్ని నమూనాలను సేకరించిన తర్వాత శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఈ వేరియంట్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు దీనికి “డెల్టాక్రాన్” గా నామకరణం చేశారు. ఈ కొత్త వేరియంట్ లో డెల్టా వేరియంట్ లక్షణాలు మరియు ఓమిక్రాన్ లక్షణాలు ఉండటం వల్ల దీనికి డెల్టాక్రాన్ అనే పేరు పెట్టారు.

అయితే, ఈ కొత్త వేరియంట్ ను చూసి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో డెల్టా క్రాన్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని మరి కొందరు అంటున్నారు.

x