కరోనా వైరస్ ఒక పక్క ప్రజల ప్రాణాలను తీస్తుంటే దానికి తోడుగా బ్లాక్ ఫంగస్ ప్రజలను భయపడుతుంది. ఇది ఇలా ఉంటె మరో కొత్త ఫంగస్ బయటకు వచ్చింది. దాని వైట్ ఫంగస్ గా గుర్తించారు వైద్యులు. ఈ వైట్ ఫంగస్ సోకిన నలుగురిని బీహార్లో గుర్తించారు. కరోనా లక్షణాలే ఈ ఫంగస్ సోకినా వారిలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఇమ్యూనిటీపవర్ లేనివారికి ఈ వైట్ ఫంగస్ ఎక్కువగా సోకుతున్నట్లు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్న ప్రజలకు కొత్త రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసుల మరణాలు భయపడుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త వైట్ ఫంగస్ వెలుగుచూసింది.

బీహార్లోని పాట్నా వైద్య కళాశాలలో తాజాగా 4 వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. బ్లాక్ ఫంగస్ కంటే ఈ ఫంగస్ మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైట్ ఫంగస్ ఉన్న నలుగురికి కరోనా వైరస్ లేదని తెలిపింది. ఆ వైట్ ఫంగస్ రోగుల్లో కరోనా లక్షణాలు మాత్రం ఉన్నాయని చెప్పారు. నలుగురు రోగుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ నెగిటివ్గా తేలిందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు.

నలుగురు రోగులు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని వారికి యాంటీ ఫంగల్ ఔషధాలు ఇస్తున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైట్ ఫంగస్ కేవలం ఊపిరితిత్తుల పైనే కాకుండా శరీరంలోని ఇతర భాగాలు అయినా గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, నోరు వంటి వాటిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనిపిస్తున్నా లక్షణాలే, ఈ వైట్ ఫంగస్ సోకినప్పుడు కూడా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇది ఊపిరితిత్తుల పై దాడి చేస్తుందని హెచ్ ఆర్ సి టి టెస్ట్ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చు అని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ మాదిరిగానే ఇది కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి సోకే అవకాశం ఎక్కువగా ఉందని, డయాబెటిస్ స్టెరాయిడ్లు ఎక్కువగా వాడటం వల్ల వైరస్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.

x