మొదట బ్లాక్ ఫంగస్ ఆ తర్వాత వైట్ ఫంగస్ ఇప్పుడేమో క్రీమ్ ఫంగస్ వచ్చింది. ఈ ఫంగస్లు కరోనా నుంచి కోలుకున్నామనే సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే భయపడుతున్న జనానికి కొత్త టెన్షన్ పట్టుకుంది. దేశంలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు, రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తో పాటు ఈ ఫంగస్లు ప్రజలను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి.

మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో క్రీమ్ ఫంగస్ కేసు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఫంగస్ కూడా ప్రమాదకరమేనని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాల ఈఎన్‌టీ విభాగం అధికారులు చెబుతున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ తు బాధపడుతున్న ఓ రోగికి బ్లాక్ మరియు క్రీమ్ ఫంగస్ రెండు సోకినట్లు వైద్యులు గుర్తించారు.

కరోనా రోగులకు ఇస్తున్న యాంటీబయాటిక్ మందుల ద్వారా జీర్ణాశయంలో ఉండే కీలకమైన గట్‌ బ్యాక్టీరియా నశిస్తుంది. శరీరంలో గట్‌ బ్యాక్టీరియా ఉంటే ఫంగస్ లను ముందుగానే ఎదుర్కోవచ్చని వైద్యులు తెలిపారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు అయినా ఎదుర్కోవడంలో ఈ గట్‌ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

x