ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది, ఈరోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి అందరిని ఆందోళన కలిగిస్తుంది. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు.

దీనితో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కర్ఫ్యూ నుంచి మెడికల్ ఫార్మసీలు, లాబ్స్, మరియు పెట్రోల్ బంకులు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వైద్యం కోసం హాస్పిటల్ కి వెళ్లి రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు అని ప్రభుత్వం చెప్పింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనితో ప్రభుత్వం మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో బ్యాంకు పని వేళలు కుదించారు, దీంతో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండనున్నట్లు రాష్ట్ర బ్యాంకుల సమితి ప్రకటించింది.

image source

x