ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నైట్ కర్ఫ్యూ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుంది. కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆస్పత్రులు, మెడికల్ షాప్ లు, మెడికల్ ల్యాబ్ లు, జర్నలిస్టులకు మినహాయింపు కలిగించారు. అలాగే, అత్యవసరం విధుల్లో ఉండే న్యాయ అధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు కల్పించారు.

అయితే, వారు విధినిర్వహణలో గుర్తింపు కార్డును చూపించాలి. వీరితో పాటు గర్భిణీ స్త్రీలు, చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు మరియు ప్రయాణ టిక్కెట్లు చూపించి గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది.

x