నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా మాస్ట్రో. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ సినిమాకు రీమేక్. నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా నెగటివ్ రోల్ ను పోషిస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం నుండి ఒక వీడియో ను ఈరోజు విడుదల చేశారు. విడుదల చేసిన వీడియో లో నితిన్ పియానో వాయిస్తూ కనిపించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ ఒక అంధుడి పాత్రలో కనిపించనున్నారు. స్వర సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఎన్ సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జిష్షు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.