ఫన్ బకెట్ భార్గవ్ గా ప్రసిద్ది చెందిన ‘చిప్పడా భార్గవ్’ తన టిక్ టోక్ వీడియోలతో ఫేమర్స్ అయ్యాడు. విశాఖపట్నంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను ఇటీవల అరెస్టు చేశారు. ఇంతలో, అతనితో తరచూ కలిసి నటించిన నటి నిత్యా శ్రీ ఈ విషయంపై స్పందించి, ఈ సంఘటనతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, నిత్యా ఈ రోజు ఒక వీడియో ను విడుదల చేసింది.
ఆ వీడియో లో, “నేను భార్గవ్ అరెస్ట్ గురించి సోషల్ మీడియా ద్వారా మాత్రమే తెలుసుకున్నాను. నేను గత ఒక సంవత్సరం నుండి అతనితో కలిసి లేను. మేము కలిసి అసలు ఏ వీడియోస్ తీయడం లేదు. నేను హైదరాబాద్‌కు వచ్చేశాను. ఈ వార్తలో నెటిజన్లు నా పేరును ఎందుకు లాగుతున్నారో నాకు తెలియదు. ”
“ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబందించిన వీడియోలలో నా ఫోటోలను ఉపయోగించవద్దు. నన్ను సహకరిస్తున్న వారికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ” అని నిత్యా శ్రీ అన్నారు. నిత్యా మరియు భార్గవ్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఓహ్ మై గాడ్’ వీడియోస్ మంచి విజయాన్ని సాధించాయి.