హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన 18 వ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించారు. దీనిలో ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. # NKR18 అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ‘ఏ టైమ్ ట్రావెల్ ఫామ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్‌ లైన్‌ కనిపిస్తుంది.

ఆవిష్కరించబడిన పోస్టర్ చూస్తుంటే ఒక పుస్తకం పై కత్తిని గుచ్చినట్లు మరియు దాని వెనకాల ఎర్ర జెండా ఉంది. ఆ జెండాలో సింహం గర్జన తో బొమ్మ కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ అద్భుతంగా మరియు ఖచ్చితంగా మంచి అంచనాలను కలిగి ఉంది. వశిస్టు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.

మే 28 న ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ ను విడుదల చేయనున్నారు. పోస్టర్ లోని కాన్సెప్ట్ చూస్తుంటే ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు కనిపిస్తుంది. సుదీర్ఘ విరామం తరువాత, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తన సొంత సినిమాను నిర్మిస్తున్నాడు.

x