నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కి ఏమైంది..? ఆయన ఒక్క సరిగా సన్నబడి పోవడానికి గల కారణాలు ఏమిటి..? ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పై మరోసారి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన కొత్త అవతారం చూసి అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడికి ఏమైందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఏమి చేసిన అది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. ఆయన లావు అయిన మరియు సన్నపడిన విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల ఆయన మరి సన్న పడినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అక్కడ అధికారిక మీడియా ధ్రువీకరించింది. వారి నాయకుడు ఒక్క సరిగా సన్నగా కనిపించడంతో ఆయన ఆరోగ్యానికి ఏమైందని ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కిమ్ బయటకు కనిపించడం చాలా తక్కువ. అయితే ఇటీవల పార్టీలో అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. మీటింగ్ ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన ఒక సంగీత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను అక్కడ అధికారిక మీడియా ప్రసారం చేసింది. వాటిలో సన్న పడిపోయినట్లు కనిపిస్తున్న కిమ్ ను చూసి ప్రజలు షాక్ కు గురయ్యారు.

ఆయన కొన్ని నెలల్లోనే ఒక్కసారిగా బరువు తగ్గటంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి అనారోగ్యం కారణమా లేదా కావాలనే బరువు తగ్గారా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతకుముందు ఆయన బరువు 140 కిలోలు ఉండవచ్చని దక్షిణ కొరియా మీడియా ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన దాదాపు 15 నుంచి 20 కిలోల బరువు తగ్గినట్లు చెబుతున్నారు.

x