జూనియర్ ఎన్టీఆర్‌కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. కనుక ఇటీవల ఆయన లంబోర్ఘిని కారును కొనుగోలు చేశారు. దీని విలువ 3 కోట్లకు పైనే ఉంటుంది. ఈ కారు ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్. భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని కారుకు ఇప్పుడు ఎన్టీఆర్‌ యజమాని. ఈ కారు చాలా విలాసవంతంగా మరియు అద్భుతమైన ఫీచర్లు ను కలిగి ఉంది. ఈ కారు నీరో నోక్టిస్ మాట్ తో మరియు అరోన్సియో అర్గోస్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో వస్తుంది.

ప్రస్తుతం విడుదలైన ఈ ఫొటోస్ డెలివరీకి ముందు బెంగళూరుకు చెందిన ఆటో మొబిలియార్డెంట్ పోస్ట్ చేసారు. ఇక ఎన్టీఆర్‌ తన కొత్త కారుకు ఎటువంటి ఫాన్సీ నెంబర్ ను రిజిస్ట్రేషన్ చేపిస్తారో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోపక్క ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి షోకి హోస్ట్ గా చేయనున్నారు.

x