యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో ఒక చిత్రం వస్తున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ దీని గురించి అధికార ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు దీని గురించి ఎన్టీఆర్ ఒక విషయం చెప్పాడు.

‘డెడ్‌లైన్’ అనే హాలీవుడ్ ఆధారిత వెబ్ పోర్టల్‌తో ఎన్టీఆర్ మాట్లాడారు మరియు అతను ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి మరియు అతని భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చాలా వివరాలను పంచుకున్నాడు. రాబోయే సినిమాలకు సంబంధించి, కొరటాల శివ చిత్రం తరువాత, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చిత్రం ఉండనున్నట్లు ఎన్టీఆర్ చెప్పారు.

తారక్ అభిమానులు ఈ విషయం వినీ చాలా ఆనందించారు మరియు వారు # NTR31 అనే హ్యాష్‌ట్యాగ్ ఈ సమయంలో ట్రెండ్ చెయ్యడం ప్రారంబించారు. తారక్ మరియు ప్రశాంత్ నీల్ యొక్క ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉంది.

‘ఆర్‌ఆర్‌ఆర్’ తో వస్తున్న నందమూరి హీరో ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్‌లు మనసును కదిలించబోతున్నాయని, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయని అన్నారు. కోమరం భీమ్ పాత్ర కోసం 18 నెలల శిక్షణ పొందానని, అతని లాగా కనిపించటానికి తొమ్మిది కిలోల బరువు పెరిగానని వెల్లడించాడు.

x