శర్వానంద్ నుంచి మరో కొత్త సినిమా వస్తుంది. ఈ సినిమాకు శ్రీ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ సినిమాకు మూవీ మేకర్స్ “ఒకే ఒక జీవితం” అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

టైటిల్ చూస్తుంటే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది.
పోస్టర్‌ ను చూస్తుంటే ఇందులో సైన్స్ ఫిక్షన్ అంశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. జీవితం యొక్క అందాన్ని వెతుకుతున్నట్లు శర్వా కనిపిస్తున్నాడు. శర్వానంద్‌ గిటార్ బ్యాగ్‌ని తగిలించుకుని ముందుకు సాగుతున్నట్టుగా తాజా పోస్టర్ ఉంది.

ఈ పోస్టర్లో రెండు వేర్వేరు కాలాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పచ్చదనం తో కూడిన వాతావరణం. ఇందులో పోస్టాఫీసు, ఉత్తరం, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు, ఇంద్రధనస్సు మొదలైనవి కనిపించాయి. మరోవైపు కాలుష్యం తో నిండిన వాతావరణం కనిపిస్తుంది. ఇందులో కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, విమానం వంటివి కనిపించాయి. ఇవి చూస్తుంటే ప్రపంచం ఎక్కడ నుంచి ఎక్కడికో వెళ్లినట్టు కనిపిస్తుంది. ఈ సమాజంలో వచ్చిన మార్పుల ఆధారంగా ఈ సినిమా ఉండనున్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

x