టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. చాలా మంది ప్రేక్షకులు అతని సంగీతాన్ని వీని మైమరిచిపోతుంటారు. ఇప్పుడు తమన్ ఒక కొత్త డ్రీమ్ పై దృష్టి పెట్టాడు, అది చాలా గొప్పది.

వివరాల్లోకి వెళితే, తమన్ ఇటీవల ఒక ట్విట్టర్ యూజర్ యొక్క వీడియోను పోస్ట్ చేసాడు, అందులో ఒక బామ్మా క్రింద కూర్చొని ఉంది ఆమె వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఆహారం ఇచ్చాడు. బహుశా బామ్మా తిని చాలా రోజులు అయిందనుకుంటా బామ్మాకు ఆహారం ఇస్తున్నప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. అంతేకాదు ఆమె తనకు ఆహారాన్ని ఇచ్చిన వ్యక్తికి డబ్బును ఇస్తుంటే ఆ వ్యక్తి డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు.

ఈ వీడియోను చూసిన తమన్ కన్నీరుమున్నీరయ్యాడు మరియు అతను ఒక వృద్ధాప్య గృహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ట్విట్టర్ వేదికగా తమన్ ఇలా రాశాడు, “నా గుండె ముక్కలుగా విరిగింది. ఉద్యాన వనంతో ఒక వృద్ధాప్య గృహాన్ని నిర్మించటానికి నాలో ఒక కొత్త కల ప్రారంభమైంది, అది త్వరలోనే నేను చేస్తాను, దేవుడు దానికి కావాల్సిన బలాన్నినాకు ఇస్తాడని నమ్ముతున్నా, ఎవరు ఆహారాన్ని వృథా చేయవద్దు, అవసరమైన వారికి ఆహారాన్ని ఇవ్వండి. మనం మనుషులుగా ఉందాం ”అని తమన్ ట్వీట్ చేశారు.

x