అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం చేసిన ట్వీట్లు ఇప్పుడు ఒలి రాబిన్సన్ ను వెంటాడుతున్నాయి. ఆ ట్విట్లు ప్రభావం వల్ల ఒలి రాబిన్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఒలి రాబిన్సన్ సారీ చెప్పిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ మాత్రం ఒప్పుకోలేదు.

అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఎవ్వరికి అంత ఈజీగా రాదు. అందుకు తగ్గట్టే ఒలి రాబిన్సన్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక అయ్యాడు. అతను ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. ఇంతలోనే ఒలి రాబిన్సన్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అతను 8 ఏళ్ల క్రితం చేసిన జాతి వివక్ష, విద్వేష, లైంగిక వ్యాఖ్యలపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత ఒలి రాబిన్సన్ పై ఈసీబీ చర్యలు తీసుకోండి. రెండో టెస్టులో రాబిన్సన్ ఆడటం లేదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. అతను 2013లో స్త్రీ వివక్ష, జాత్యహంకారం సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గత బుధవారం టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఒలి రాబిన్సన్ వివాదాస్పద ట్వీట్లు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని అన్నాడు. ఎనిమిదేళ్ళ క్రితం ఫస్ట్ స్టేషన్ లో ట్వీట్లు చేశానన్నాడు. తాను జాత్యహంకారి కాదు అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో తన మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పాడు.

ఆనాటి ట్వీట్లు పై చింతిస్తున్నాను అని వివరించాడు. అయితే ఇప్పుడు వ్యక్తిగా పరిణితి చెందానని ఆయన చెప్పాడు. రాబిన్సన్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఈసీబీ మాత్రం చర్యలు తీసుకుంది. ఈసీబీ ఒలి రాబిన్సన్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈసీబీ క్రమశిక్షణ విభాగం రాబిన్సన్ చేసిన ట్వీట్ లపై దర్యాప్తు చేస్తోంది.

x