సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కెటిఆర్ కు ట్విట్టర్ లో ఒక వింత అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో కరోనా బాధితుల నుండి వేలాది మంది అభ్యర్ధనలు వస్తుండటంతో, ఆయన సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తనను సహాయం కోరిన వ్యక్తులకు సహాయం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశారు. ఒక వ్యక్తి తనకు జోమాటో నుండి ఆర్డర్ చేసిన అదనపు మసాలా చికెన్ బిర్యానీ లభించకపోవడంతో కెటిఆర్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు.

ఆ ట్విట్టర్ యూజర్ ఇలా వ్రాశాడు, “నేను చికెన్ బిర్యానీని అదనపు మసాలా మరియు లెగ్ పీస్‌తో ఆర్డర్ చేశాను, కాని అవేమీ రాలేదని” చెప్తూ కేటీఆర్ మరియు జొమాటో ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

పూర్తిగా ఆశ్చర్యపోయిన కెటిఆర్, “కావలసిన ఆర్డర్ పొందడంలో తన ప్రమేయం లేనందున ఈ విషయంపై తనను ఎందుకు ట్యాగ్ చేసావని సదరు వ్యక్తి పై విస్మయం వ్యక్తం చేశారు. తన నుంచి ఏం కోరుకుంటున్నావు” అని కెటిఆర్ స్పందించారు.

x