దేశంలో కరోనా కేసులు తగినట్లే తగ్గి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3 లక్షల 17 వేల 532 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 475 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారి పాజిటివీటి రేటు 16 శాతం దాటింది.
ప్రస్తుతం మన దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువలో ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 43 వేల 697 కరోనా కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 40 వేల 499 కేసులు, కేరళలో 34 వేల199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 9 వేలు దాటింది.