మూడు రోజుల్లో 400 కోట్లకు పైగా ఆదాయాన్ని మందుబాబులు ఎక్సైజ్ శాఖకు అందించారు. ఒకవైపు కరోనా తాండవం చేస్తుంటే మరోవైపు లాక్ డౌన్ ఉన్న మందుబాబులు ఎక్కడా తగ్గడం లేదు. లాక్‌డౌన్‌ ప్రకటన తెలిసిన కొద్ది గంటల్లోనే పెగ్గు మీద పెగ్గు వేస్తూ, కొన్ని బాటిల్స్ ఇంటికి తీసుకు వెళుతూ తమ వంతు టాక్స్ కడుతున్నారు మందుబాబులు.

గత మూడు రోజులుగా తెలంగాణా లో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు వైన్ షాపు యజమానులు. 11వ తేదీ 125 కోట్ల 39 లక్షల అమ్మకాలు జరగ్గా, లాక్‌డౌన్‌ మొదటిరోజు అంతే 12వ తేదీన డిపోల నుంచి 157 కోట్ల మద్యం కొనుగోలు జరిగింది. రెండవ రోజు ఇప్పటివరకు 135 కోట్ల అమ్మకాలు జరగ్గా, మూడు రోజులు కలిపి 417 కోట్ల మద్యం డిపోలో నుంచి కొనుగోలు చేశారు వైన్స్ అధికారులు. ఈ ఒక్క నెలలోనే నిన్నటి వరకు మద్యం అమ్మకాలు 962 కోట్లుగా నమోదైంది.

లాక్‌డౌన్‌ పేరు వినిపించగానే ముందుగా స్పందించింది మందుబాబులే. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటన రాగానే సరిగ్గా పది పదిహేను నిమిషాల్లో వైన్ షాప్ దగ్గర మద్యం ప్రియులు క్యూ కట్టారు. బాటిల్స్ లెక్క కాదు ఏకంగా బాక్సలెక్క కొనేశారు. లెక్క ఎక్కువ అయినా పర్వాలేదు కానీ మందు కిక్కు మాత్రం తగ్గకూడదు అంటున్నారు. కరోనా వ్యాప్తి కి లాక్ డౌన్ పెడితే, మందు బాబులు మాత్రం కనీసం సామజిక దూరం కూడా పాటించకుండా మద్యం కొనుగోలు చేస్తున్నారు.

x