హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని లోటస్ హాస్పటల్ లో దారుణం చోటుచేసుకుంది. హాస్పటల్ బిల్ చెల్లించలేదని తల్లి బిడ్డను ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించింది. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
బాధితురాలు ఇటీవలే కాన్పు కోసం హాస్పటల్లో జాయిన్ అయింది. అయితే హాస్పిటల్లో చేరకముందే హాస్పటల్ యాజమాన్యం 1,80,000 ప్యాకేజీని మాట్లాడుకున్నారు. బాధితురాలు హాస్పటల్ యాజమాన్యం మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అలా ముందుగా మాట్లాడుకున్నట్లు మొత్తం డబ్బులు చెల్లించారు బాధితులు.
కానీ డిచ్ఛార్జ్ సమయంలో హాస్పటల్ యాజమాన్యం మరో మూడు లక్షలు చెల్లించాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే తల్లి బిడ్డలను డిచ్ఛార్జ్ చేసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఇలా రెండు రోజులుగా హాస్పటల్ లోనే తల్లీ బిడ్డలను నిర్బంధించారు. బాధితుల కుటుంబ సభ్యులు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరు స్పందించడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.