మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం జరిగింది. ఈ రోజు 22 మంది కోవిడ్ పేషెంట్స్ మరణించారు. నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని ఒక హాస్పిటల్ వెలుపల ఒక ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అయ్యింది, దీని ఫలితంగా 30 నిమిషాలకు పైగా ఆక్సిజన్ సరఫరా అంతరాయం కలిగింది. ఈ ప్రమాదం కారణంగా 22 మంది కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ పేషెంట్స్ నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ మునిసిపల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరియు వారందరూ నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవసరమయ్యే వెంటిలేటర్ల పై ఉన్నారు.

ఆక్సిజన్ ట్యాంకర్ లీకైన విజువల్స్ చూస్తుంటే, ట్యాంకర్ల నుండి వేగంగా లీక్ అయిన ఆక్సిజన్ వాయువు, చుట్టుపక్కల ప్రాంతాలను తెల్లటి పొగతో కప్పేసింది. ఇంతలో, కోవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో రోగులు మరియు వారి కుటుంబాలు భయపడ్డారు. ఆస్పత్రి స్థలంలో జరిగిన ఈ దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.

ఈ ఆసుపత్రి కోవిడ్ పేషెంట్స్ కు ప్రత్యేకంగా చికిత్స అందిస్తుంది. సుమారు 150 మంది రోగులు ఈ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది వెంటిలేటర్ల పై ఉన్నారు, మరియు వారిలో ఇంకో కొంతమంది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉన్నారు. విషాదం జరిగిన వెంటనే, ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది పేషెంట్స్ను ఇతర ఆసుపత్రులకు తరలించారు.

ఈ సంఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే హామీ ఇచ్చారు. “దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరణాత్మక ప్రకటన జారీ చేయబడుతుంది” అని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు.

x