జగిత్యాల జిల్లాలో పది నెలల పసి పాప కరోనాను జయించింది. ఇబ్రహీంపట్నం మండలం, వర్ష కొండ గ్రామానికి చెందిన వేముల ఆనంద్ కు కరోనా లక్షణాలు ఉండటం తో టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వచ్చింది. అతని భార్య రాధికాకు మాత్రం పాజిటివ్ వచ్చింది. మరుసటి రోజు వారి కుమార్తె ఆరాధ్యకు టెస్ట్ చేయించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

ఈ క్రమంలో ముగ్గురు హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మంచి మందులు మరియు ఆహారం తీసుకున్నారు. చిన్నారికి కూడా వైద్య సిబ్బంది సలహాలతో ఇచ్చిన మందులను వేశారు. ఇలా హోమ్ ఐసోలేషన్ ముగిసింది తర్వాత టెస్ట్ చేయించుకోగా ముగ్గురికి నెగిటివ్ వచ్చింది. పది నెలల చిన్నారి కరోనాను జయించడం తో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

x