పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా “వకీల్ సాబ్”. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రీ ఎంట్రీ మూవీ కావడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అభిమానులకు ఒక టెన్షన్ మొదలైంది, అది ఏమిటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏప్రిల్ నెలలో చాలా విడుదల అయ్యాయి అందులో కొన్ని సినిమాలు రికార్డు స్థాయిలో ఉంటే మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా కూడా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావటంతో, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

ఈ వకీల్ సాబ్ సినిమా హిందీలో అమితాబచ్చన్ గారు నటించిన పింక్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నివేద థామస్, అంజలి మరియు అనన్య ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రతినాయకుడి వకీల్ పాత్రలో ప్రకాష్ గారు నటించారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తరువాత మూడు సంవత్సరాలు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడంతో అభిమానులు ఎంతగానో పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రయిలర్, సాంగ్స్ అన్ని రికార్డు స్థాయిలో నిలిచాయి.

ఏప్రిల్ నెలలో విడుదల అయ్యి పవన్ కళ్యాణ్ కెరియర్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు.
1. బద్రి
2. ఖుషి
3. జల్సా

అదే ఏప్రిల్ నెలలో విడుదల అయ్యి పవన్ కళ్యాణ్ గారికి కెరియర్లో లో ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు.
1. జాని
2. తీన్ మార్
3. సర్దార్ గబ్బర్ సింగ్

ఈ వకీల్ సబ్ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు వేచి ఉండాల్సిందే.

x