సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. ఇది మళయాళం లో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇన్‌స్పెక్టర్ భీమ్లా నాయక్‌ పాత్రలో కనిపించగా, రానా దగ్గుబాటి ప్రత్యర్థి పాత్రలో కనిపించనున్నారు.

ఇంతలో, చిత్ర బృందం అభిమానులకు ఒక అద్భుతమైన వార్తను వెల్లడించింది. ఆగస్టు 15న ఉదయం 9:45 గంటలకు మూవీ మేకర్స్ సినిమా యొక్క టైటిల్ మరియు గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

x